Tuesday, March 25, 2014

పవన్ పయనంపై అసంతృప్తికి లోనైన వర్మ


విభిన్న తరహా సినిమాలు చేయడం రామ్ గోపాల్ వర్మకి ఎంత పేరుందో, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా అంతే పేరుంది. ఈ మధ్యకాలంలో సినిమాల గురించి కాకుండా వర్మ కాస్త పాజిటివ్ గా చేసిన కామెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత రాజకీయ పార్టీ పెడితే బాగుంటుందని, అల అపెడితే నేను ఓటు వేస్తానని అన్నాడు. తను అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించాడు. ఈ విషయంలో బాగా హ్యాపీ గా ఫీల్ అయిన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగుల విషయంలో కాస్త అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ‘పవన్ తన ఒరిజినాలిటీతో పబ్లిక్ లో సూపర్బ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అతనిలో 10% కూడా క్రేజ్ లేని వారితో కలిసి ఆయన్ని చూడడం అస్సలు బాలేదని’ వర్మ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చూసాక వర్మ అసంతృప్తికి కారణం పవన్ నరేంద్ర మోడీని కలవడమే అని అర్థమవుతోంది. ఇక ముందు పవన్ ఏం చేస్తాడో దానికి ఎవరెవరి నుంచి ఎలాంటి విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుందో చూడాలి.

0 comments:

Post a Comment