Saturday, March 22, 2014

పవన్ పార్టీపై తమన్నా ఏమంది ?


సినిమాల గురించి , అందులో తమ హీరోల గురించి గంటల తరబడి గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కథానాయికలు .. రాజకీయాల విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతారు . రాజకీయాలా .. ? ఆ సంగతులు మాకెందుకండీ .. ? అనేస్తారు . ఇప్పుడు తమన్నా కూడా అదే .. అంది . రాజకీయాల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు . నన్నొదిలేయండి ప్లీజ్ - అంటోంది . మీ హీరో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు కదా ? మరి మరి మీ స్పందనేంటి ? ? అని అడిగితే '' నాకు రాజకీయాల గురించి అస్సలు తెలీదు . జీరో నాలెడ్జ్ . తెలియని విషయం గురించి మాట్లాడితే బాగోదు .. అందుకే నన్నొదిలేయండి . కావాలంటే సినిమాల గురించి ఏమైనా అడగండి . చెబుతా .. '' అని మీడియాని రిక్వస్ట్ చేసింది . పవన్ - తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కలసి నటించారు . ఆ సమయంలో పవన్ సిన్సియారిటీ గురించి తెగ కబుర్లు చెప్పిన తమ్మూ .. ఈసారి ఎందుకు సైలెంట్ అయిపోయింది . ఏం మాట్లాడితే ఏమవుతుందో .. ? ఏ హీరో చిన్నబుచ్చుకొంటాడో అన్న భయం ఏమో .. ? ?

0 comments:

Post a Comment