Saturday, March 22, 2014

యన్టి. ఆర్ పార్టీ పెట్టాలను కుంటున్నాడా ?


జనసేన - టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైనట్టే . పవన్ కల్యాణ్ సపోర్ట్తో తెదేపా మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి . తేదేపా తన ప్రచారంలో పవన్ని ప్రధాన అస్త్రంగా వాడుకొంటుందన్నది నిర్వివాదాంశం . అయితే ఇప్పటికే తేదేపాలో ఓ ట్రంప్ కార్డ్ ఉంది . అదే ... ఎన్టీఆర్ . పవన్ ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా మారింది . గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తెదేపా తరపున విస్ర్కృతంగా ప్రచారం చేశాడు . తెలుగుదేశం కండువాను భుజంపై వేసుకొంటాడన్నది గ్యారెంటీ . అయితే ఇటు పవన్ - అటు ఎన్టీఆర్ ... వీరిద్దరిలో బాబు ఎవరిని వాడుకొంటారన్నది భవిష్యత్తు నిర్ణయించాలి . జూనియర్కి చెక్ పెట్టడానికి తెదేపాకి ఇదే అవకాశం .. అన్నవాళ్లూ లేకపోలేదు . గత ఎన్నికలలో జూనియర్ ప్రచారం చేసిన మాట వాస్తవమే . అతను వెళ్లిన చోటల్లా భారీగా జనం వచ్చారు . అయితే .. ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా తెదేపా ఓడిపోయింది . ఆ తరవాత .. పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్టుగానే ఉండిపోయాడు జూనియర్ . బాబాయ్తో గొడవలు .. టీడీపీ నా సొంత ఆస్తి అన్నట్టు వ్యవహరించడం ఎన్టీఆర్కి ప్రతిబందకాలుగా మారాయి . ఇప్పుడు కాకపోయినా ఎపుడో ఒకప్పుడు ఎన్టీఆర్ వల్ల తనకు ప్రమాదం తప్పదని భావించిన బాబు ... మధ్యలో లోకేష్ ని రంగంలోకి తెచ్చి జూనియర్కి చెక్ పెట్టాడు బాబు . అది కొంత మేర విజయవంతమైంది . ఇప్పుడు పవన్ రాకతో టీడీపీలో ఎన్టీఆర్ ప్రాబల్యం పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఎన్టీఆర్ - పవన్ .. ఇద్దరినీ వాడుకొంటే ... సినీ గ్లామర్కు కొదవ ఉండదని భావిస్తే .. ఎన్టీఆర్ని బాబు వదులుకోకపోవచ్చు . మొత్తానికి పవన్ రాకతో .. తెదేపాలో ఎన్టీఆర్ స్పీడు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి .జనసేన - టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైనట్టే . పవన్ కల్యాణ్ సపోర్ట్తో తెదేపా మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి . తేదేపా తన ప్రచారంలో పవన్ని ప్రధాన అస్త్రంగా వాడుకొంటుందన్నది నిర్వివాదాంశం . అయితే ఇప్పటికే తేదేపాలో ఓ ట్రంప్ కార్డ్ ఉంది . అదే ... ఎన్టీఆర్ . పవన్ ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా మారింది . గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తెదేపా తరపున విస్ర్కృతంగా ప్రచారం చేశాడు . తెలుగుదేశం కండువాను భుజంపై వేసుకొంటాడన్నది గ్యారెంటీ . అయితే ఇటు పవన్ - అటు ఎన్టీఆర్ ... వీరిద్దరిలో బాబు ఎవరిని వాడుకొంటారన్నది భవిష్యత్తు నిర్ణయించాలి . జూనియర్కి చెక్ పెట్టడానికి తెదేపాకి ఇదే అవకాశం .. అన్నవాళ్లూ లేకపోలేదు . గత ఎన్నికలలో జూనియర్ ప్రచారం చేసిన మాట వాస్తవమే . అతను వెళ్లిన చోటల్లా భారీగా జనం వచ్చారు . అయితే .. ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా తెదేపా ఓడిపోయింది . ఆ తరవాత .. పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్టుగానే ఉండిపోయాడు జూనియర్ . బాబాయ్తో గొడవలు .. టీడీపీ నా సొంత ఆస్తి అన్నట్టు వ్యవహరించడం ఎన్టీఆర్కి ప్రతిబందకాలుగా మారాయి . ఇప్పుడు కాకపోయినా ఎపుడో ఒకప్పుడు ఎన్టీఆర్ వల్ల తనకు ప్రమాదం తప్పదని భావించిన బాబు ... మధ్యలో లోకేష్ ని రంగంలోకి తెచ్చి జూనియర్కి చెక్ పెట్టాడు బాబు . అది కొంత మేర విజయవంతమైంది . ఇప్పుడు పవన్ రాకతో టీడీపీలో ఎన్టీఆర్ ప్రాబల్యం పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఎన్టీఆర్ - పవన్ .. ఇద్దరినీ వాడుకొంటే ... సినీ గ్లామర్కు కొదవ ఉండదని భావిస్తే .. ఎన్టీఆర్ని బాబు వదులుకోకపోవచ్చు . మొత్తానికి పవన్ రాకతో .. తెదేపాలో ఎన్టీఆర్ స్పీడు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి .

0 comments:

Post a Comment